నిప్పుల గుండంలా రాష్ట్రం

శంకరపట్నం, కొడకండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. మంగళవారం తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది.

Published : 17 Apr 2024 03:12 IST

భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీలు
వడదెబ్బతో ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: శంకరపట్నం, కొడకండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. మంగళవారం తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అనేక మండలాల్లో 44.5 డిగ్రీలపైన నమోదైంది. ఖమ్మం నగరంలో సాధారణం కన్నా 5.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరగడంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బుధ, గురువారాల్లోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.  వడదెబ్బ బారిన పడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. .

  • కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన చిట్ల రామక్క (78) ఉదయం హుజూరాబాద్‌లో నివసిస్తున్న పెద్ద కుమారుడు రమేశ్‌ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే కుప్పకూలి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
  • సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన సంగం సుందరయ్య (70) ఖాళీ మద్యం సీసాలు ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం కొడకండ్ల మండలం మొండ్రాయిలో సీసాలు ఏరుకుంటూ వడదెబ్బతో రోడ్డుపైనే కుప్పకూలి కన్నుమూశాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని