సైబర్‌ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలి

సైబర్‌ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ వెంకటరమణ సూచించారు.

Published : 17 Apr 2024 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ వెంకటరమణ సూచించారు. విశ్వవిద్యాలయ కంప్యూటర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మంగళవారం సైబర్‌ సెక్యూరిటీపై వెబినార్‌ నిర్వహించారు. వెంకటరమణ దీనిని ప్రారంభించారు. సైబర్‌ నేరాలపై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు.. రైతుల్లో చైతన్యం తేవాలన్నారు. హైదరాబాద్‌ సి-డాక్‌కు చెందిన ప్రాజెక్టు మేనేజర్‌ ఎం.జగదీశ్‌బాబు ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌ సెక్యూరిటీపై శాస్త్రవేత్తలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని