కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలున్నాయా?

‘మీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఎలా ఉంది? ఏమైనా సమస్యలున్నాయా? డబ్బులు ఖాతాల్లోకి జమయ్యాయా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ రైతులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు.

Updated : 17 Apr 2024 05:46 IST

రైతులతో ఫోన్‌లో మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: ‘మీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఎలా ఉంది? ఏమైనా సమస్యలున్నాయా? డబ్బులు ఖాతాల్లోకి జమయ్యాయా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ రైతులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని గన్నారం, చంద్రాయన్‌పల్లి కొనుగోలు కేంద్రాలలో మంగళవారం ఆయన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్‌, అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధాన్యం తేమ శాతాన్ని కొలిచి చూశారు. సకాలంలో తూకం జరిగిందని, సొమ్ములు ఖాతాల్లో జమ చేశారని రైతులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయిలో ఉన్న కేంద్రాన్ని కూడా పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని