సామరస్యానికి ప్రతీక శ్రీరామనవమి

రాష్ట్ర ప్రజలందరికీ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రగాఢమైన భక్తితో దేశవ్యాప్తంగా జరుపుకొంటారని.. ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 03:34 IST

ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాధాకృష్ణన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలందరికీ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రగాఢమైన భక్తితో దేశవ్యాప్తంగా జరుపుకొంటారని.. ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆదర్శప్రాయ జీవితం నుంచి స్ఫూర్తి పొందుదామని గవర్నర్‌ పేర్కొన్నారు.

ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. భద్రాచల క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ తెలిసేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ఎల్లవేళలా సీతారాముల కరుణాకటాక్షాలు ఉండాలి: కేసీఆర్‌

రాష్ట్రమంతా పాడిపంటలతో సుభిక్షంగా వెలుగొందేలా, అందరూ ఆనందంతో జీవించేలా సీతారాముల కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని భారాస అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను అందరూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలన్నారు. శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని