విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా సర్వీస్‌

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య మరో స్వదేశీ విమాన సర్వీసును నడిపేందుకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముందుకొచ్చింది.

Published : 17 Apr 2024 03:34 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ-హైదరాబాద్‌ మధ్య మరో స్వదేశీ విమాన సర్వీసును నడిపేందుకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముందుకొచ్చింది. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్‌ 737-800 విమానంతో సర్వీసును మంగళవారం ప్రారంభించింది. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సర్వీసు 8.55 గంటలకు బయలుదేరి వెళ్లింది. దీన్ని రోజూ నడపనున్నట్లు తెలిపింది. ప్రారంభోత్సవంలో విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని