18 నుంచి సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌-దానాపూర్‌ల మధ్య ఏప్రిల్‌, మే నెలల్లో అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

Published : 17 Apr 2024 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-దానాపూర్‌ల మధ్య ఏప్రిల్‌, మే నెలల్లో అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్‌-దానాపూర్‌ (నం.07021) రైలు ప్రతి గురువారం బయల్దేరుతుంది. దానాపూర్‌-సికింద్రాబాద్‌ (నం.07022) రైలు ప్రతి శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ రైళ్లు రాష్ట్రంలోని జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పుర్‌కాగజ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతాయి. రిజర్వేషన్‌తో నిమిత్తం లేకుండా అప్పటికప్పుడు టికెట్‌ కొనుక్కుని రైలు ఎక్కేలా ద.మ.రైల్లే అవకాశం కల్పిస్తోంది. ఈ రైళ్లలో మొత్తం జనరల్‌ బోగీలు మాత్రమే ఉండనున్నాయి.

మరో రెండు మార్గాల్లో

కాచిగూడ నుంచి కొచువెళికి ఏప్రిల్‌ 18, 25 తేదీల్లో ప్రత్యేక రైలు (నం..07229) నడిపిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. తిరుగుప్రయాణం కొచువెళి నుంచి కాచిగూడకు ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో రైళ్లు (నం..07230) బయల్దేరుతాయి. షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్‌ నుంచి సంత్రాగచ్చికి ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో ప్రత్యేక రైళ్లు (నం..07221) బయల్దేరుతాయి. సంత్రగాచ్చి నుంచి సికింద్రాబాద్‌కు ఏప్రిల్‌ 21 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ప్రత్యేక రైళ్లు (నం..07222) ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని