ప్రచార రథంపై చెప్పుల దండ

ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

Published : 17 Apr 2024 03:35 IST

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మెదక్‌ లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ గ్రామ వీధుల్లో ప్రచార రథం మంగళవారం తిరుగుతోంది. గ్రామానికి చెందిన యాదగిరి, అతడి భార్య, తల్లి వాహనానికి అడ్డుగా వచ్చి ఆపారు. వాహనం ముందున్న అభ్యర్థి చిత్రపటంపై చెప్పుల దండ వేసి.. పటాన్ని చెప్పులతో కొట్టారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నపుడు తమకు చెందాల్సిన భూమి హక్కులను వేరొకరికి కల్పించారని ఆరోపించారు. ఈ ఘటనపై డ్రైవర్‌ కావేటి బన్ని, భారాస మిరుదొడ్డి మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ పరశురాములు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని