భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే.

Updated : 17 Apr 2024 05:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయా టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఈ నెల 4న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వర్తమానం పంపింది.  ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఇతర నాయకులు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడంతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు