కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 22కి వాయిదా

ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Updated : 17 Apr 2024 05:43 IST

ఈనాడు, దిల్లీ: ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మంగళవారం దీనిపై విచారణ జరగాల్సి ఉన్నా రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవుపై వెళ్లడంతో కేసు తదుపరి విచారణను 22కి వాయిదా వేశారు.  అదే రోజు కవిత ఈడీ, సీబీఐ కేసుల్లోని బెయిల్‌ అప్లికేషన్లపై విచారణ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని