కళాకారులకు పదవీ విరమణ ఉండదు

నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 17 Apr 2024 04:45 IST

సినీనటుడు కోట శ్రీనివాసరావు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రచయిత, నటుడు, దర్శకుడు తుర్లపాటి రామచంద్రరావు, ప్రముఖ రంగస్థల, సినీ, టీవీ నటుడు యు.సుబ్బరాయశర్మలకు స్వర్ణవంశీ- యలవర్తి రాజేంద్రప్రసాద్‌లకు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కళాకారులకు ఎప్పటికీ పదవీ విరమణ ఉండదన్నారు. జానపద, పౌరాణిక నాటకాల్లో తుర్లపాటి బహుముఖ ప్రతిభ కనబర్చారని ప్రశంసించారు. తుర్లపాటి మాట్లాడుతూ.. త్యాగరాయ గానసభలో పలు నాటకాలు ప్రదర్శించిన తాను.. అదే వేదికపై జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు సూర్యప్రకాశరావు రచించిన ‘కొత్త మలుపు’ నాటికను కళాకారులు ప్రదర్శించారు. కార్యక్రమంలో సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, వంశీ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు, ప్రముఖులు టి.సుధాదేవి, యలవర్తి ధనలక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని