రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!

సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌(ఈసీ) కూడా అదే చెబుతుంది.

Updated : 18 Apr 2024 08:19 IST

ఓటు ఒక్కచోటే వేసేలా అధికారుల చర్యలు

ఈనాడు, ఆసిఫాబాద్‌: సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌(ఈసీ) కూడా అదే చెబుతుంది. అయితే కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దున ఉంటాయి. వీరికి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి ఓటరు కార్డులు మంజూరయ్యాయి. దీంతో వీరు రెండు చోట్ల ఓటు వేస్తుంటారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో మొదటి విడత పోలింగ్‌ ఈ నెల 19న జరగనుంది. దీంతో ఓటరు నచ్చిన చోటే ఓటు వేయాలని, రెండోసారి వేయకూడదని అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని