సివిల్స్‌ విజేతలకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

సివిల్స్‌లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్‌ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.

Published : 18 Apr 2024 03:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్స్‌లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్‌ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌లో సత్తా చాటిన తెలంగాణ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించిన పాలమూరు బిడ్డ అనన్యరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన అనన్యరెడ్డి, ఎన్‌.సాయికిరణ్‌, కె.ఎన్‌.చందన జాహ్నవి, మెరుగు కౌశిక్‌కు, వారి తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని