మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం

జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 04:05 IST

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. ‘మహాత్మాగాంధీ స్మారక నిధి’ సంస్థ వజ్రోత్సవాల సందర్భంగా ‘మహాత్మా’ పేరుతో ముద్రించిన 2024 సావనీర్‌ను ఆయన గురువారం గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. సంస్థ ప్రతినిధులు సూర్యానాయక్‌, రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ లీగల్‌సెల్‌ ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

పీసీసీ లీగల్‌సెల్‌ ఛైర్మన్‌గా పొన్నం అశోక్‌గౌడ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, పలువురు న్యాయవాదులు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని