అభిషేక్‌ బోయిన్‌పల్లి మధ్యంతర బెయిల్‌ మే 8 వరకు పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌ వ్యాపారి అభిషేక్‌ బోయిన్‌పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది.

Published : 19 Apr 2024 04:06 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌ వ్యాపారి అభిషేక్‌ బోయిన్‌పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌దత్తాలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. భార్య అనారోగ్యం దృష్ట్యా అభిషేక్‌కు మార్చి 20న కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చి తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. అయితే గురువారం ఈ కేసు లిస్ట్‌లో లేకపోయినా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మెన్షన్‌ చేయడంతో ధర్మాసనం దానిపై విచారించి తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు అతని మధ్యంతర బెయిల్‌ పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని