కృష్ణా జలాల విడుదలకు కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్‌ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

Published : 19 Apr 2024 04:07 IST

మే నెలాఖరుకు తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీలు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్‌ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు విడుదల చేయనున్నారు. సాగర్‌లో 500 అడుగుల స్థాయి నుంచి ఈ నీటిని తీసుకోనున్నారు. ఈ మట్టం స్థాయిలో 17.55 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయని అంచనా వేశారు. వీటిలో భవిష్యత్‌ అవసరాలకు 3.55 టీఎంసీలను కేటాయించారు. గురువారం నాటికి సాగర్‌లో 129.14 టీఎంసీలు (పూర్తి స్థాయి నిల్వ 312.05 టీఎంసీలకు) ఉన్నాయి. జలాశయంలో 590 అడుగులకు గాను నీటి మట్టం 508.50 అడుగుల వద్ద ఉంది. ఈ నెల 12న హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బోర్డు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని