ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ

నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు.

Published : 19 Apr 2024 04:09 IST

నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు. గత నెలలో ఆసుపత్రిని తనిఖీ చేసిన సందర్భంలో.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎండవేడికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి వచ్చింది. ఈ మేరకు స్పందించి కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆరు బాలింతల వార్డుల్లో ఏసీలు అమర్చారు. ప్రస్తుతం నల్గొండలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ఈ ఏసీలు లేకుంటే పసిపిల్లలతోపాటు తామూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారమని బాలింతలు చెబుతున్నారు.

ఈనాడు, నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని