కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!

డీజిల్‌ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్‌ లోకోషెడ్‌ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్‌ రైలు ఇంజిన్‌ను రూపొందించారు.

Published : 19 Apr 2024 04:10 IST

డీజిల్‌ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్‌ లోకోషెడ్‌ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్‌ రైలు ఇంజిన్‌ను రూపొందించారు. వినియోగంలో లేకుండా షెడ్‌లో పడిఉన్న పాతకాలపు డీజిల్‌ ఇంజిన్‌కు విడి భాగాలను జతచేసి, రంగులు వేసి, షెడ్‌ ముందు ప్రత్యేక స్థలంలో ఇలా నిలిపారు. అమెరికాలోని లోకోమోటివ్‌ కంపెనీలో తయారైన డబ్ల్యూడీఎం2 లోకో డీజిల్‌ ఇంజిన్‌ ఇది. 1974 జులై 27న భారత్‌కు చేరుకున్న ఇది సికింద్రాబాద్‌ డివిజన్‌లో 4 దశాబ్దాలకు పైగా సేవలందించింది. బరువు 112 టన్నులు. 2016 మే 25 నుంచి దీని సేవలు నిలిపివేయగా.. కాజీపేట లోకోషెడ్‌లో పక్కన పడేశారు. దీన్ని కార్మికులు ప్రత్యేకంగా హెరిటేజ్‌ లోకోగా తీర్చిదిద్దారు. రైల్వే 171వ వసంతోత్సవాలు, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని షెడ్‌ సీనియర్‌ డీఎంఈ స్వరాజ్‌కుమార్‌ ఈ నమూనా వారసత్వపు రైలు ఇంజిన్‌ను ఆవిష్కరించారు. అధికారులు ఎం.భానుప్రకాష్‌, వై.ఎన్‌.రాజశేఖర్‌, ఎ.రవీందర్‌, ధీరజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాజీపేట, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని