ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం

దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Updated : 19 Apr 2024 05:30 IST

‘దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం
భాగ్యనగరంలోని 15 ప్రాంతాలు ఈ జాబితాలో

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజల ద్వారా తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్‌కు సంబంధించి 15 పర్యాటక ప్రాంతాలను ‘దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌’లో పొందుపరిచారు. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని అక్కడ కల్పించాల్సిన వసతులను తెలపాలి. ఓటేసేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉంది. ఇందుకోసం https://innovateindia.mygov.in/dekho-apna-desh/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇందులో ‘నేమ్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌’ అనే బాక్స్‌లో హైదరాబాద్‌ అని టైప్‌ చేస్తే నగరంలోని చార్మినార్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోట, జుమ్మేరాత్‌ బజార్‌, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం తదితర 15 పర్యాటక ప్రదేశాలు కనిపిస్తాయి. వీటితో పాటు దేశంలోని ఇతర పర్యాటక స్థలాలను సైతం ఎంపిక చేసుకుని, అక్కడ లేని వసతులను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని