ఇథనాల్‌ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి

పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్‌ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

Published : 19 Apr 2024 04:13 IST

ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్‌ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. సంబంధిత విషయమై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ‘ఇథనాల్‌ పరిశ్రమల రద్దు-ప్రజల భవిష్యత్తు’ అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్‌ మాట్లాడుతూ..నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం చిత్తనూరు-ఎగ్లాస్‌పూర్‌ శివారులో ఏర్పాటుచేసిన సంబంధిత కంపెనీతోపాటు ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన వాటినీ రద్దు చేయాలని పేర్కొన్నారు. అలాంటి కంపెనీలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలన్నారు. విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ..కాలుష్య నియంత్రణ మండలి అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ ఎం.రాఘవచారి, పర్యావరణవేత్త సాగర్‌ ధారా, రైతు ఉద్యమ నేత చక్రవర్తి, కుల అసమానతల నిర్మూలన పోరాట సంఘం రాష్ట్ర బాధ్యుడు లక్ష్మయ్య, సభ్యులు నాగరాజు, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని