ఎయిమ్స్‌లో హీమోడయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో హీమోడయాలసిస్‌ యూనిట్‌ను డైరెక్టర్‌ వికాస్‌ భాటియా గురువారం ప్రారంభించారు.

Published : 19 Apr 2024 04:14 IST

బీబీనగర్‌, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో హీమోడయాలసిస్‌ యూనిట్‌ను డైరెక్టర్‌ వికాస్‌ భాటియా గురువారం ప్రారంభించారు. ఈ యూనిట్‌లో ఐదు హీమోడయాలసిస్‌ మిషన్లు, గంటకు 250 లీటర్ల రక్తాన్ని శుద్ధిచేసే సామర్థ్యం ఉన్న ఆర్‌వో సిస్టమ్‌, ఐదు ఐసీయూ పడకలు, మూడు మానిటర్లు, ఈసీజీ యంత్రాలు ఉంటాయని ఆయన తెలిపారు. వాస్క్యులర్‌ యాక్సెస్‌ ప్రక్రియ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్‌ పనివేళల్లో మాత్రమే ఈ సేవలు రోగులకు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అభిషేక్‌ అరోరా, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కల్యాణి, నెఫ్రాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్‌ అనిత, డాక్టర్‌ శ్యామలాఅయ్యర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని