సంక్షిప్త వార్తలు (3)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల రుణం సేకరణ నిమిత్తం బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వుబ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న వీటిని వేలం వేయనున్నట్లు వివరించింది.

Updated : 20 Apr 2024 05:33 IST

రూ.1500 కోట్ల రుణానికి బాండ్ల వేలం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల రుణం సేకరణ నిమిత్తం బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వుబ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న వీటిని వేలం వేయనున్నట్లు వివరించింది. మొత్తం 5 రాష్ట్రాలకు రూ.12 వేల కోట్ల రుణాల కోసం వేలం వేస్తున్నారు. వీటిలో తమిళనాడుకు రూ.4 వేల కోట్లు, ఏపీకి రూ.3 వేల కోట్లు కూడా ఉన్నాయి.


విద్యాశాఖలో విలీనం చేయాలి

మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయ సంఘం

ఈనాడు,హైదరాబాద్‌: తమను విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, ఉపాధ్యక్షుడు స్వామిలు కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో 194 పాఠశాలల్లో 3000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నామని, తమకు అరకొర వేతనాలే వస్తున్నాయని తెలిపారు. ఏపీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ వేతనాలు చెల్లిస్తున్నారని, అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని కోరారు.


గ్రూప్‌-4 సర్వీసుల్లో స్పోర్ట్స్‌ కోటా పత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-4 సర్వీసుల్లో స్పోర్ట్స్‌ కోటా కింద 1569 మంది అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు క్రీడా ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటలకు సంబంధిత తేదీల్లో అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని