‘వాట్సప్‌ గురు’ మరో ఘనత!

తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ) మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌  మరో ఘనత సాధించారు.

Published : 20 Apr 2024 05:26 IST

సివిల్స్‌ ఇంటర్వ్యూ విజేతల్లో 200 మందికి మెలకువలు
తెలంగాణ అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌కు ప్రశంసలు

ఈనాడు, హైదరాబాద్‌ - జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే:: తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ) మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌  మరో ఘనత సాధించారు. సివిల్స్‌ ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సుదీర్ఘకాలంగా ‘వాట్సప్‌ గురు’ ద్వారా మెలకువలు అందిస్తున్న ఆయన ఈసారీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే వెలువడిన 2023 సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల జాబితాలో మహేశ్‌ భగవత్‌ నుంచి సూచనలు పొందిన 200 మంది ఉండటం విశేషం. 100లోపు ర్యాంకులు సాధించిన వారిలో మహబూబ్‌నగర్‌కు చెదిన దోనూరు అనన్యరెడ్డి (ఆల్‌ఇండియా 3వ ర్యాంకు), రుహాని(5), నౌషీన్‌(9) తదితరులు ఉన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఆదా సందీప్‌కుమార్‌ 830 ర్యాంకు సాధించారు. గురువారం తనను కలిసిన సందీప్‌కుమార్‌ను మహేశ్‌భగవత్‌ అభినందించారు.

ఈనెల 20న టీ-శాట్‌ ఆధ్వర్యంలో సివిల్స్‌ మెంటార్‌, ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ భగవత్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీ-శాట్‌ సీఈఓ బి.వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనేందుకు 040-23540326/726 నంబర్లలో లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 4039కు కాల్‌ చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని