గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆదేశించింది.

Published : 20 Apr 2024 05:34 IST

నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆదేశం
విచారణకు 22న బృందం రాక

భువనగిరి, న్యూస్‌టుడే: భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర బృందం ఈ నెల 22న భువనగిరికి రానుంది. ఈ నెల 12న పాఠశాలలో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా చికిత్స పొందుతూ 16న ప్రశాంత్‌ అనే విద్యార్థి మృతిచెందాడు. దీనిపై కేంద్ర బృందం పాఠశాలను సందర్శించి నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు స్థానిక ఆర్డీవోకు సమాచారం అందినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు