కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?

చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది.

Published : 20 Apr 2024 05:35 IST

లెక్కలు తీస్తున్న నీటిపారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. కృష్ణా బేసిన్‌లోని చెరువుల కింద సాగునీటి వినియోగం అనంతరం తిరిగి నదిలో కలిసే నీటి సామర్థ్యాన్ని జిల్లాల వారీగా గణిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 90 టీఎంసీలను కేటాయించగా, అందులో 45 టీఎంసీలు చిన్ననీటి పారుదల రంగంలో పొదుపు జలాలుగా చూపారు. మరో 45 టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి మళ్లింపులో భాగంగా సాగర్‌ ఎగువన వినియోగించుకునే వెసులుబాటు ఉన్న జలాలు. ప్రస్తుతం పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉంది. ఇటీవల కేంద్ర జల సంఘం చిన్ననీటి పారుదల రంగంలో పొదుపు జలాల లెక్కలపై రాష్ట్రాన్ని వివరాలు అడిగింది. దీనికితోడు కృష్ణా ట్రైబ్యునల్‌లోనూ పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన నీటి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని