ఎన్నికల తనిఖీల్లో భాగంగా... కరీంనగర్‌లో రూ.88.49 లక్షల స్వాధీనం

లోక్‌సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా కరీంనగర్‌లో వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు రూ.88.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Published : 21 Apr 2024 03:48 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా కరీంనగర్‌లో వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు రూ.88.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణ ఏసీపీ జి.నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ రాజీవ్‌చౌక్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అశోక్‌నగర్‌కు చెందిన ఉప్పుల రాఘవచారి, హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన సూరోజు రమేశ్‌ల వద్ద రూ.71 లక్షలు, తెలంగాణచౌక్‌ వద్ద సుభాష్‌నగర్‌కు చెందిన దామెర అరుణ్‌కుమార్‌ నుంచి రూ.14.89 లక్షలు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద అశోక్‌నగర్‌కు చెందిన అంకిత్‌ తివారి వద్ద రూ.2.60 లక్షలు పట్టుకున్నారు. వీరంతా ద్విచక్రవాహనాలపై నగదు తీసుకెళ్తూ పట్టుబడ్డారని, సరైన ఆధారాలు చూపకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణ, ఐటీ శాఖ అధికారులకు నగదును అప్పగిస్తామన్నారు. ఈ సోదాల్లో ఇన్‌స్పెక్టర్లు సరిలాల్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని