చెట్టెక్కిన అమాత్యుడు

ఎక్సైజ్‌, పర్యాటక, పురావస్తుశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Published : 21 Apr 2024 03:48 IST

కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఎక్సైజ్‌, పర్యాటక, పురావస్తుశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం బోడబండ తండాలో ఓ కార్యకర్తకు చెందిన మామిడి తోటలో ఇలా మంత్రి మామిడి చెట్టెక్కి ప్రసంగించారు. కొడంగల్‌లో తాను తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో చెట్టెక్కిన జ్ఞాపకం గుర్తొచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.మల్లురవిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని