4.5 కిలోల ‘పెద్ద’ లక్ష్మణ ఫలం

సాధారణంగా లక్ష్మణ ఫలం కిలో నుంచి రెండు కిలోల వరకు ఉంటుంది. కానీ భువనగిరి పట్టణ శివారులోని అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో లక్ష్మణ ఫలం అధిక బరువుతో కాసింది.

Published : 21 Apr 2024 03:49 IST

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: సాధారణంగా లక్ష్మణ ఫలం కిలో నుంచి రెండు కిలోల వరకు ఉంటుంది. కానీ భువనగిరి పట్టణ శివారులోని అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో లక్ష్మణ ఫలం అధిక బరువుతో కాసింది. ఈ ఫలం 4.5కిలోల అధిక బరువుతో పాటు 15 అంగుళాల పొడువుగా కాయడం అరుదైన విషయమని కేంద్ర నిర్వాహకుడు జిట్టా బాల్‌రెడ్డి అన్నారు. సోర్‌సూప్‌ పేరుతో పిలిచే లక్ష్మణ ఫలం చెట్టు ఏటా రెండు దఫాలుగా కాత కాస్తుందన్నారు. క్యాన్సర్‌ వ్యాధి నియంత్రణకు, ఆయుర్వేద మందుల తయారీకీ ఈ చెట్టులోని అన్ని భాగాలు వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కిలో పండు రూ.150కి విక్రయిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని