చిటారుకొమ్మన చింతచిగురు ధర!.. కిలో రూ.700కు అమ్మకం

మార్కెట్‌లో చింతచిగురు అమ్మకానికి వచ్చింది. హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌తో పాటు రైతుబజార్లలో రైతులు రెండు, మూడు రోజులుగా విక్రయిస్తున్నారు.

Published : 21 Apr 2024 04:03 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: మార్కెట్‌లో చింతచిగురు అమ్మకానికి వచ్చింది. హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌తో పాటు రైతుబజార్లలో రైతులు రెండు, మూడు రోజులుగా విక్రయిస్తున్నారు. చింత చెట్ల ఆకులు రాలిపోయాక, వచ్చిన చిగురును వంటకాల్లో ఉపయోగిస్తారు. దాంతో చేసిన పప్పు, మాంసం వంటకాలను భోజనప్రియులు ఇష్టంగా తింటారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్‌ రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.500- రూ.600 పలుకుతోంది. మెహిదీపట్నం రైతుబజార్‌లో శనివారం కిలో చింత చిగురు రూ.700 పలికింది. చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి, ప్రాణాలకు తెగించి సేకరిస్తామని రైతులు చెబుతున్నారు. సెలవు దినాలు, ముఖ్యంగా ఆదివారం గిరాకీ ఎక్కువగా ఉంటుందని మెహిదీపట్నం రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు. బహిరంగ మార్కెట్లో 100 గ్రాములు రూ.100కు అమ్ముతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని