సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా రఘురాం

హైకోర్టు రిజిస్ట్రార్‌లతోపాటు పలు జిల్లాల్లో పనిచేస్తున్న 47 మందిని బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులిచ్చింది.

Published : 21 Apr 2024 03:52 IST

రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీ పంచాక్షరి
47 మంది జిల్లా జడ్జీల బదిలీలు

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు రిజిస్ట్రార్‌లతోపాటు పలు జిల్లాల్లో పనిచేస్తున్న 47 మందిని బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులిచ్చింది. సిద్దిపేట ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి (పీడీజేె)గా ఉన్న డాక్టర్‌ టి.రఘురాంను సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా ఉన్న సీహెచ్‌ రమేశ్‌బాబు హనుమకొండ పీడీజేగా బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లోని అదనపు కుటుంబ న్యాయస్థానం జడ్జి సీహెచ్‌ పంచాక్షరి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీగా ఉన్న ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి సూర్యాపేట పీడీజేగా బదిలీ అయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రా) ఎన్‌.నర్సింగ్‌రావు సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, మరో రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) వి.బాలభాస్కర్‌ మేడ్చల్‌- మల్కాజిగిరి పీడీజేగా బదిలీ అయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌)గా మేడ్చల్‌ -మల్కాజిగిరి కోర్టు నుంచి బదిలీపై వస్తున్న బి.ఆర్‌.మధుసూదన్‌రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా ఉన్న బి.సురేష్‌ నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. సిద్దిపేట మొదటి అదనపు జిల్లా జడ్జిగా ఉన్న మురళీమోహన్‌ సిటీ సివిల్‌ కోర్టు 9వ అదనపు చీఫ్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు మే 1వ తేదీన రిలీవ్‌ కావాలని.. మిగిలిన జడ్జీలంతా మే 1 లోగా కొత్త పోస్టుల్లో బాధ్యతలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే విచారణ పూర్తయి రిజర్వు చేసిన కేసుల్లో తీర్పులు వెలువరించవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు