తక్కువ ధరకు ధాన్యం కొనే వ్యాపారులపై చర్యలు తీసుకోండి

రాష్ట్రంలో తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను పౌరసరఫరాలశాఖ ఆదేశించింది.

Published : 22 Apr 2024 03:04 IST

కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను పౌరసరఫరాలశాఖ ఆదేశించింది. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్‌ కవర్లు సిద్ధం చేసి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,109 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి..6.75లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ధాన్యం కొనుగోలు విషయంలో పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్‌ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని