పాదాలు నర్తించె.. జల పాఠాలు బోధించె

సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం ‘లేక్‌ క్లీన్‌ అప్‌’ కార్యక్రమం నిర్వహించింది.

Published : 22 Apr 2024 03:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం ‘లేక్‌ క్లీన్‌ అప్‌’ కార్యక్రమం నిర్వహించింది. నగరంలోని చెరువుల పరిరక్షణ, పరిసరాల్లో వ్యర్థాలు, చెత్త తొలగింపు తదితర పనులపై వినూత్నంగా అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా మణికొండ పురపాలక సంఘం పరిధిలోని నెక్నాంపూర్‌ చెరువు గట్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సంస్థకు చెందిన పలువురు యువతులు  చెరువుల రక్షణ, నీటి లభ్యతపై అవగాహన కల్పిస్తూ, ఆలోచింపజేసేలా నాట్య ప్రదర్శనలిచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని