వడగళ్ల వానతో 3,120 ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో శనివారం కురిసిన అకాల వర్షాలు, వడగళ్లతో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు.

Published : 22 Apr 2024 03:05 IST

మార్చి నెల పంట నష్టపరిహారం చెల్లింపునకు
ఈసీ అనుమతి కోరతాం: మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం కురిసిన అకాల వర్షాలు, వడగళ్లతో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి వరకు 2,200 ఎకరాల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేయగా.. రంగారెడ్డి, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లో మరో 920 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. ఇప్పటికే మార్చిలో కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంటనష్టాలకు పరిహారం విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కోరామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా మరోమారు సంప్రదించి సత్వరమే నిధుల విడుదలకు అనుమతి కోరతామన్నారు. తాజాగా జరిగిన నష్టాన్ని కూడా త్వరగా మదింపు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వానాకాలం సీజన్‌కు సరఫరా చేసే పచ్చిరొట్ట విత్తనాల సేకరణ కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని