ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు, ఇద్దరు మావోయిస్టు సభ్యులు తమ వద్ద లొంగిపోయారని భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తెలిపారు.

Updated : 22 Apr 2024 05:07 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు, ఇద్దరు మావోయిస్టు సభ్యులు తమ వద్ద లొంగిపోయారని భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారిని చూపించి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సరిహద్దు గ్రామమైన పుట్టపాడుకు చెందిన మిలీషియా డిప్యూటీ కమాండర్‌ కర్జం పొజ్జా, డోకుపాడుకు చెందిన మిలీషియా సభ్యులు రవ్వ సన్న, ముసికి సన్న అలియాస్‌ శ్రీను, కోవాసి మంగ, ఇదే గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యులు రవ్వ లక్క, మడకం జోగాలు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరు చర్ల, కిష్టారం ఏరియా కమిటీల సాయుధ దళ సభ్యులతో కలిసి సరిహద్దు ప్రాంతంలో పలు విధ్వంసక ఘటనల్లో పాల్గొన్నారని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో 141 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ అధికారులు, స్థానిక    పోలీసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని