మెతుకు సీమలో యాపిల్‌ తోట

శీతల ప్రాంతాలకు పరిమితమైన పంట యాపిల్‌. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే దీనిని పండిస్తారు.

Published : 22 Apr 2024 03:54 IST

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: శీతల ప్రాంతాలకు పరిమితమైన పంట యాపిల్‌. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే దీనిని పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగి, తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కొద్ది మంది వీటి సాగు చేపట్టారు. ఉష్ణమండల ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో సాగు  చేయాలని నిర్ణయించారు, హైదరాబాద్‌కు చెందిన బీహెచ్‌ఈఎల్‌ విశ్రాంత సీనియర్‌ మేనేజర్‌ కిశోర్‌బాబు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఈదులపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తొలిసారి యాపిల్‌ సాగు చేపట్టారు. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని