30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.

Published : 23 Apr 2024 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

రేపు ఇంటర్‌..

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా సోమవారం తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ఫలితాలను విద్యార్థులు www.eenadu.net, www.eenadupratibha.net, https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in  వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని