గరం.. గరం

రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 24 Apr 2024 05:43 IST

రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల నమోదు
పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళ మృతి
సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరి మృత్యువాత

ఈనాడు, హైదరాబాద్‌- మంథని గ్రామీణం, ఆత్మకూర్‌(ఎస్‌), వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. ఈ జిల్లాలోని వేములపల్లి, దామరచర్ల, అనుముల హాలియా, తిరుమలగిరి(సాగర్‌), త్రిపురారం, గట్టుప్పల్‌, నిడమనూరు మండలాల్లోనూ 44 డిగ్రీల ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.  భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 43.7 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో 41.3 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలున్నాయి. ఖమ్మంలో సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరంలో లక్ష్మి(55) అనే మహిళ మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని కోటినాయక్‌తండాకు చెందిన దరావత్‌ గోల్యా(70), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం బాలరాజ్‌పల్లిలో నాగుల బాలయ్య(50) అనే రైతు ఎండదెబ్బతో అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ కొన్ని జిల్లాల్లో వడగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని