యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

Published : 24 Apr 2024 03:42 IST

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీలక్ష్మీసమేతుడైన స్వామివారు తెప్పలో మూడుసార్లు జలవిహారం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్‌రావు, ఛైర్మన్‌ నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

రూ.2.30 కోట్ల హుండీ ఆదాయం

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో నగదు, కానుకలను కొండ కింది ఆధ్యాత్మిక వాడలోని శ్రీసత్యనారాయణస్వామి మండపంలో మంగళవారం లెక్కించారు. 28 రోజులకు నగదు రూ.2,30,76,344, బంగారం 147 గ్రాములు, వెండి 4.9 కిలోలు సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని