పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

Updated : 29 Apr 2024 15:29 IST

దాతల సాయం అర్థిస్తున్న తల్లిదండ్రులు

చొప్పదండి, న్యూస్‌టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బాబు అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తమ పనులు మానుకొని బిడ్డను పట్టుకొని అనేక ఆసుపత్రులు తిరిగారు. అందినకాడికి అప్పులూ చేశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో దాతల సహాయాన్ని అర్థిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన చిలుక నరేశ్‌, శ్యామల దంపతులకు 2022 ఆగస్టులో బాబు (ప్రణవ్‌రాజ్‌) పుట్టాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా కాలేయం పనితీరు సరిగా లేదని వైద్యులు నిర్ధరించారు. నిలోఫర్‌ ఆసుపత్రిలో నాలుగు నెలల వయసులో బాబుకు శస్త్రచికిత్స చేయించారు. అయినా వ్యాధి నయం కాలేదు. ఆ బాలుడికి కడుపు ఉబ్బుతోంది. ద్రవ పదార్థాలు తప్ప.. ఘన పదార్థాలు తినలేడు. వాంతులు అవుతుంటాయి. బాబుని తీసుకుని ఆ దంపతులు సుమారు 16 నెలలుగా హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల వెంట తిరుగుతున్నారు. కాలేయ మార్పిడి చేయాలని, రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. తలకు మించిన భారమే అయినా బాబు కోసం ఇప్పటికే సుమారు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక దాతల సహాయాన్ని కోరుతున్నారు. దాతలు ఎవరైనా బాలుడి తండ్రి నరేశ్‌ను మొబైల్‌ నంబరు 70751 66566లో సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని