నేడు ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.

Published : 24 Apr 2024 03:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఉదయం 11 గంటలకు ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తారు. ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.inతోపాటు www.eenadu.net,  www.eenadupratibha.net వెబ్‌సైట్లలో చూడవచ్చు.

హాజరు మినహాయింపు రుసుం చెల్లింపునకు 1 వరకు గడువు

మే, జూన్‌లలో జరిగే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ గ్రూపుల సబ్జెక్టులు రాసే ప్రైవేటు అభ్యర్థులు (కళాశాలల్లో చదవని వారు) హాజరు మినహాయింపు కోసం రూ.500 రుసుంతో వచ్చే నెల మొదటి తేదీ వరకు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని