టీ-సాట్‌ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్‌’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం

మే 5న నిర్వహించే ‘నీట్‌’ పరీక్షపై టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్‌ సీఈవో బి.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

Published : 24 Apr 2024 04:12 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మే 5న నిర్వహించే ‘నీట్‌’ పరీక్షపై టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్‌ సీఈవో బి.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఈనెల 24 నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ(బాటనీ, జువాలజీ) సబ్జెక్టులకు సంబంధించి క్రాష్‌ కోర్సు రూపంలో 20 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు.. గురువారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు ప్రసారాలు జరుగుతాయన్నారు. సందేహాలుంటే 040-23556037, టోల్‌ఫ్రీ నంబరు 18004254039ను సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని