26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాక

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు.

Published : 24 Apr 2024 04:13 IST

ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ‘‘అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్‌ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలి. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ బందోబస్తు చేయాలి. వైద్య సౌకర్యాలు కల్పించాలి. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలి’’ అని సీఎస్‌ సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, గవర్నర్‌ కార్యదర్శి బి.వెంకటేశం, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌, ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్‌ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని