జస్టిస్‌ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి

గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది.

Published : 25 Apr 2024 03:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే నేతృత్వంలో మొదటి కోర్టు హాలులో న్యాయమూర్తులు, న్యాయవాదులు సమావేశమై రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..జస్టిస్‌ రామలింగేశ్వరరావు న్యాయవ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల జర్మనీలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లగా అక్కడే గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు, జస్టిస్‌ రామలింగేశ్వరరావు బంధువులు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని