ఇంటర్‌ ఫలితాల్లో కవలల ప్రతిభ

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్‌, లక్ష్మణ్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు.

Published : 25 Apr 2024 05:06 IST

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్‌, లక్ష్మణ్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. ఆత్మకూర్‌(ఎస్‌) ఆదర్శ పాఠశాలలో వీరు 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివారు. ఎంపీసీ విభాగంలో లక్ష్మణ్‌ 983, రామ్‌ 981 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వారు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కావడమే తమ లక్ష్యమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని