విజన్‌-2026కు డోర్నకల్‌ ఉపాధ్యాయుల శ్రీకారం

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్‌-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Published : 25 Apr 2024 05:06 IST

డోర్నకల్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్‌-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, హాజరు శాతం మెరుగుదలకు ఓ ప్రతిజ్ఞపత్రం రూపొందించారు. బుధవారం మండుటెండలో విద్యార్థుల నివాసాలకు వెళ్లి తల్లిదండ్రులతో ఆ పత్రంపై సంతకాలు తీసుకున్నారు. విద్యార్థుల సామాజిక, ఆర్థిక, విద్య, సామర్థ్య స్థితిగతులపై సర్వే చేశారు. అనాథలు, ఆర్థికంగా ఇబ్బందులున్న కుటుంబాల పిల్లలుంటే వారి చదువుకు ఆటంకం కలగకుండా పాఠశాలలో నెలకొల్పిన ‘స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్టు’ ద్వారా రవాణా సదుపాయం లేదా ప్రతి నెల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు.​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని