ఆర్‌జేసీ, మోడల్‌, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ

టీఎస్‌ఆర్‌జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది.

Published : 25 Apr 2024 05:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్‌జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. ఎంపీసీ ఫస్టియర్‌లో ఏన్కూరు గురుకుల విద్యార్థికి 468, బైపీసీలో నెక్కొండ విద్యార్థినికి 437 మార్కులు వచ్చాయంది.  

  • తమ విద్యార్థులు అత్యధికంగా ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో 983 మార్కులు, ఎంఈసీలో 973, సీఈసీలో 967 మార్కులు సాధించినట్లు మోడల్‌ స్కూళ్ల అదనపు డైరెక్టర్‌ తెలిపారు.
  • కొడంగల్‌ కేజీబీవీ విద్యార్థి ఎంపీసీలో అత్యధికంగా 988 మార్కులు పొందారని సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ మల్లయ్య బట్టు తెలిపారు.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులు రెండో సంవత్సరంలో 84.07 శాతం, మొదటి సంవత్సరంలో 75.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సొసైటీ కార్యదర్శి కె.సీతాలక్ష్మి తెలిపారు.

  • గిరిజన గురుకుల విద్యార్థులు రెండో సంవత్సరంలో 83.59 శాతం, మొదటి సంవత్సరంలో 70.18 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.  
  • బీసీ గురుకుల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 84.80 శాతం, మొదటి సంవత్సరంలో 71.17 శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు.

ఇంటర్‌లో శ్రీచైతన్య హవా

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో తమ విద్యార్థులు స్టేట్‌ ఫస్ట్‌ మార్కులు సాధించారని శ్రీ చైతన్య తెలిపింది. ఎంపీసీలో ఐదుగురు 993 (స్టేట్‌ టాప్‌) మార్కులు, బైపీసీలో 994 (స్టేట్‌ టాప్‌) మార్కులు సాధించినట్లు వెల్లడించింది. 83 మంది 993 మార్కులు పైన సాధించారని పేర్కొంది. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 26 మంది 470కి 468 మార్కులు, బైపీసీలో 19 మంది 440కి 438 మార్కులు సాధించినట్లు తెలిపింది. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ బొప్పన అభినందించారు.

నారాయణ విద్యార్థుల ప్రతిభ

ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీలో తమ విద్యార్థులు ముగ్గురు 993 మార్కులు సాధించారని సంస్థ తెలిపింది. బైపీసీ విభాగంలోనూ స్టేట్‌ టాప్‌ మార్కు 994 మార్కులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని పేర్కొంది. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బోర్డు చరిత్రలోనే 470కి 469 మార్కులను సాధించారని తెలిపింది. విద్యార్థులను నారాయణ గ్రూపు డైరెక్టర్లు సిధూర నారాయణ, శరణి నారాయణ అభినందించారు.


రెసోనెన్స్‌ అద్భుత ఫలితాలు

రెసోనెన్స్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు ఎంపీసీలో అత్యధికంగా 992 మార్కులు, బైపీసీలో 982 మార్కులు సాధించినట్లు యజమాన్యం పేర్కొంది. ఎంపీసీలో టాప్‌ 5 మార్కులను తమ విద్యార్థులు 9 మంది, జూనియర్‌ ఎంపీసీలో టాప్‌ 5 మార్కులను తమ విద్యార్థులు 155 మంది, బైపీసీలో టాప్‌ 5 మార్కులను 13 మంది సాధించిన వారిని విద్యాసంస్థల డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు అభినందించారు.  


అల్ఫోర్స్‌ ప్రభంజనం

ఇంటర్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీలో తమ విద్యార్థులు ఇద్దరు 993 మార్కులు, ఇద్దరు 992 మార్కులు సాధించినట్లు విద్యా సంస్థ వెల్లడించింది. బైపీసీలో ముగ్గురు 990 మార్కులు పొందినట్లు తెలిపింది. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 16 మంది 468 మార్కులు, జూనియర్‌ బైపీసీలో ఒక విద్యార్థిని 438 మార్కులు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి అభినందించారు.


ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయభేరి

ఇంటర్‌ ఫలితాల్లో హనుమకొండలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. తమ విద్యార్థికి ఎంపీసీలో 993 గరిష్ఠ మార్కులు వచ్చాయని విద్యా సంస్థల ఛైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. 14 మందికి 990, ఆపైన మార్కులు వచ్చాయన్నారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 13 మంది 468 మార్కులు, బైపీసీలో ముగ్గురు 438 మార్కులు తెచ్చుకున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని