పతి దేవుడికి గుడి కట్టింది!

కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్‌తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు.

Updated : 25 Apr 2024 10:22 IST

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్‌తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. తీవ్ర మానసిక వేదనకు లోనైన ఆమె ఓ దృఢ సంకల్పానికి వచ్చారు. భర్త రూపం ఎప్పటికీ కళ్లముందే కనిపించేలా.. ఆయన నిలువెత్తు విగ్రహం తయారు చేయించి గుడి కట్టించాలనుకున్నారు.

ఆమె కల బుధవారం నెరవేరింది. ఇలా మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణి తన సొంత భూమిలో భర్తకు గుడి కట్టారు. బానోతు హరిబాబుతో ఆమెకు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేదు. కొవిడ్‌ సమయంలో హరిబాబు మృతి చెందారు. దీంతో ఆయన రూపం, పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆమె భావించారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో తండాలో గుడి కట్టించారు. రాజస్థాన్‌ నుంచి విగ్రహం తెప్పించి బుధవారం ఆవిష్కరించారు. బంధువులు, స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు