కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 19న

ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ తెలిపారు.

Updated : 16 May 2024 11:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ తెలిపారు. ‘ఎ ప్యాలెట్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ పేరున ఈ నెల 19న నిర్వహించనున్న ఈ శిబిరంలో 14 సంవత్సరాలు దాటిన వారెవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారితో పెన్సిల్‌ స్కెచ్‌, పెయింటింగ్‌ వేయించటంతో పాటు స్కెచింగ్‌, డ్రాయింగ్‌ అంటే ఏమిటి, ఎలా సాధన చేయాలి, కార్టూన్స్‌ వేయటం ఎలా, ఆర్టిస్టులు ఎలాంటి మెటీరియల్‌ వాడాలి లాంటి విషయాల్లో శిక్షణనిస్తారని ఆయన వివరించారు. ఆసక్తి ఉన్నవారు 9177004848 నంబర్‌లో సంప్రదించి ఈనెల 17వ తేదీ లోపు తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని