మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్‌ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు.

Published : 18 May 2024 04:30 IST

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్‌ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. ‘నోవో నార్డిస్క్‌’ అనే సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో వందమందికి పైగా చికిత్స పొందుతుండగా వారిలో ఏడాది నుంచి 15 ఏళ్లున్న పిల్లలున్నారు. నిత్యం ఇన్సులిన్‌ తీసుకోవాల్సి రావడంతో వీరిలో చాలామంది కుంగుబాటుకు గురవుతున్నారని గ్రహించిన వైద్యులు పిల్లలందరినీ ఒక చోట కలిపేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  వారికి పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇది పెద్ద వ్యాధి కాదని ఆత్మస్థైర్యం నింపారు. ‘గ్రో ఔట్ ఆఫ్‌ డయాబెటిస్‌’ అనేది ఈ శిబిరం ఉద్దేశమని ఎంజీఎం ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ తెలిపారు. 

ఈనాడు, వరంగల్‌; న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని