జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ

రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది.

Updated : 18 May 2024 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ‘జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు’ శీర్షికతో శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంలో రాజేశ్‌కుమార్‌ దరియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను ప్రస్తావించలేదు. రాజేశ్‌కుమార్‌ దరియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మహిళా అభ్యర్థుల ఎంపికలో సమాంతర రిజర్వేషన్లు అమలవుతాయని హైకోర్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలవుతాయి. తెలంగాణ జ్యుడిషియల్‌ సర్వీసు నిబంధనలు-2023 ప్రకారం జిల్లా జడ్జి పోస్టులను ప్రత్యక్ష నియామకం కింద భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పోస్టులకు జూన్‌ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని