మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన

రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ఇ.శ్రీధర్‌ ఆదేశించారు.

Published : 18 May 2024 04:37 IST

 ఆబ్కారీ సమీక్ష సమావేశంలో కమిషనర్‌ శ్రీధర్‌

సమీక్షలో మాట్లాడుతున్న కమిషనర్‌ శ్రీధర్‌. చిత్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ఇ.శ్రీధర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కనుమరుగైందని భావించిన నాటుసారా 26 ఎక్సైజ్‌స్టేషన్ల పరిధిలో తయారవుతున్నట్లు ఇటీవలి దాడుల్లో వెల్లడైందన్నారు. ఎక్సైజ్‌శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఆబ్కారీభవన్‌లో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా బయటి రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యం(ఎన్‌డీపీఎల్‌) వచ్చినట్లు బహిర్గతమైందన్నారు. వీటి విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించాలని ఆదేశించారు.  ఆగస్టు నాటికల్లా నాటుసారాను నిర్మూలించేలా కార్యాచరణ చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని